Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-01-2022 నుంచి 15-01-2022 వరకు వార ఫలితాలు (video)

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (21:53 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సమర్ధతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. మీ కష్టం వృధా కాదు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. సోమ, మంగళ వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ద్విచక్ర వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు, ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన మనస్థిమితం లేకుండా చేస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితమీయవు. వేడుకల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ, పునర్వసు 1, 2, 3 పాదములు 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. లౌక్యంగా వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. కొంతమంది తప్పుదారి పట్టిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. బుధవారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. పత్రాల రెన్యువల్‌‍లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాహలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదివారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహకరం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆప్తులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. బంధువుల ఆహ్వానం ఉల్లాసానిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వేడుకకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు తగదు. ఆత్మీయుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. క్రీడా, కళా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకు పరుస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఈ వారం అన్ని రంగాల వారికీ శుభదాయకమే. కార్యానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. క్రీడా, కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. నిస్తేజానికి లోను కావద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. పంతాలకు పోవద్దు, అప్పులతో కాలక్షేపం చేయండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగు పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితమిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శుక్ర, శనివారాలో ముఖ్యుల కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ద్విచక్ర వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
మీ మాటే నెగ్గాలన్న పండం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపర్ణంగా వ్యవహరించవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడి పై దృష్టి పెడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అది, సోము వారాల్లో పనులు సాగవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. సంతానం చదువుల పై మరింత శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల వైఖరి చికాకు పరుస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడట్టు వదిలేయండి. వ్యాపారాల్లో స్థాయి సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 3వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంప్రదింపులు ఫలిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. కనిపించకుండా పోయిన వస్తువుల లభ్యమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. కార్మికులకు కొత్త పనులు లాభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగుతల్లికి జలహారతి.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే.. చంద్రబాబు (video)

రాజస్థాన్‌లో అద్భుతం: భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం (video)

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

తర్వాతి కథనం
Show comments