Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-08-2004 నుంచి 31-08-2024 వరకు మీ వార రాశిఫలితాలు

రామన్
శనివారం, 24 ఆగస్టు 2024 (20:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన లభించదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. వాదోపవాదాలకు దిగవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉన్నతాధికారులకు పదోన్నతి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సోమవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. కుటుంబీకులతో సంభాషిస్తారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెళుకువ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. బుధ, గురువారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దైవకార్యం, వినోదాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అనివార్యం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉన్నతాధికారులకు హోదామార్పు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి ఉంటుంది. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోలికి పోద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతల మధ్య సఖ్యతలోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిలర్లకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ ఆశాజనకం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులతో సంభాషిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో అవకతవకలను సరిచేసుకుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అనుకూలమే. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. రాబోయే ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అప్రియమైన వార్త వినవలసిన వస్తుంది. శుక్ర, శనివారాల్లో కార్యక్రమాలు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కృషి ఫలిస్తుంది. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. సామరస్యంగా మెలగండి. ఆదివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కీలక విషయాల్లో ఏకాగ్రత వహించండి. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పధంతో మెలగండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. గుట్టుగా మెలగండి. ఖర్చులు అంచనాను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదారికి ఖర్చవుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించంది. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంతానానికి శుభయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments