Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-08-2024 శనివారం దినఫలాలు - ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు....

astro11

రామన్

, శనివారం, 24 ఆగస్టు 2024 (04:01 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| పంచమి ప.1.04 అశ్వని రా.12.02 రా.వ.8.18 ల 9.48. ఉ.దు.5.42 ల 7.24.
 
మేషం :- ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయానం చేయాల్సివస్తుంది. భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
వృషభం :- ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమత్తులు చేపడతారు. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది.
 
మిథునం :- పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమంచవలసి ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమఫలితం. 
 
సింహం :- మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. స్త్రీలకు బంగారం, నూతన వస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహరాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతనటెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం.
 
కన్య :- వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆత్మీ యులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాల నిస్తాయి. 
 
ధనస్సు :- ఒక భారం దించుకున్న తర్వాతనే కొత్త పనులు చేపట్టటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. కష్టసమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు.
 
మకరం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అధికమవుతాయి.
 
కుంభం :- సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యంవంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకుఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం :- ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లుంటాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది. ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో శ్రావణ శుక్రవారం... పంచమి కూడా వచ్చేస్తోంది..