Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-08-2024 బుధవారం దినఫలాలు - ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి...

Advertiesment
astro10

రామన్

, బుధవారం, 21 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ ఐ|| విదియ రా.8.21 శతభిషం ఉ.6.31 పూర్వాభాద్ర తె.4.56 ప.వ.12.29 ల 1.59. ప.దు. 11.40 ల 12.31.
 
మేషం :- ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాతారణం అనుకూలించక పోవడం వల్ల మీ పనులు అనుకూలంగా సాగవు. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకొండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు.
 
వృషభం :- ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. అయిన వారి నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి.
 
మిథునం :- భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి ఉంటుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళుకువ అవసరం. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని సదావకాశాలు లభిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. 
 
సింహం :- కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధికానవస్తుంది. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
కన్య :- బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.
 
తుల :- కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. స్త్రీల పై సన్నిహితులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షించవలసి వస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వైద్య రంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కోర్టు వ్యవహరాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు.
 
ధనస్సు :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాల నిస్తాయి. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. బంధువులరాకతో ఖర్చులు అధికం. సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. మీ సృజనాత్మకతతో మీరు కోరుకున్న రంగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉత్తమమైన సమయం.
 
మకరం :- ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. కోర్టు వ్యవహరాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం అధికవుతుంది. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయమవుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
కుంభం :- బ్యాంకింగ్ వ్యవహారాలలోనిపనులు సానుకూల మవుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బందువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల పట్ల మక్కువ అధికమవుతుంది. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల బాటలో సాగుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు.
 
మీనం :- గృహోపకరణాలు, వాహనం అమర్చుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..