శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ ఏకాదశి ఉ.5.56 ద్వాదశి తె.5.09 మూల ఉ.10.22 ఉ. వ. 8.44 ల 10.22. రా.వ.7.58 ల 9.34. ఉ.దు. 8.15 ల 9.06 ప. దు. 12.31 ల 1.22.
మేషం :- ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. వస్త్ర. బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
వృషభం :- ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమత్తులు చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబములో ప్రశాంతత నెలకొంటుంది. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మిథునం :- వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహనచోదకులకు ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమంచవలసి ఉంటుంది.
సింహం :- వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఇతరులకు మేలు చేసి అపవాదుల పాలవుతారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కన్య :- ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
తుల :- రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు.
వృశ్చికం :- మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనస్సు :- సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదాపడుట వల్ల నిరుత్సాహానికి గురవుతారు.
మకరం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
కుంభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. స్వయంకృషితో రాణిస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
మీనం :- రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కుంటారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదా పడతాయి. బంధువుల ఆకస్మిక రాక మీకు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.