Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-08-2024 శనివారం దినఫలాలు - నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి...

Advertiesment
astro6

రామన్

, శనివారం, 17 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు|| త్రయోదశి తె.4.04 పూర్వాషాఢ ఉ.10.21 సా.వ.6.12 ల 7.46. ఉ.దు.5.42 ల 7.24.
 
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుంటారు. 
 
మిథునం :- దంపతుల మధ్య కలహాలు అధికమువుతాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం చేతికందక పోవడంతో నిరుత్సాహానికి గురౌతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు మెళుకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి.
 
సింహం :- రవాణా రంగాలలో వారికి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఏదన్న అమ్మకానికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులుకాగలరు. బంధువుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు.
 
కన్య :- ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనచోదకులకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసివస్తుంది.
 
తుల :- సహోద్యోగులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవలు పెరుగుతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారంఉంది.
 
వృశ్చికం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప ఆస్వస్థతకు గురవుతారు. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. 
 
ధనస్సు :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. మీరంటే అసూయపడే ఒకరి ద్వారా అనవసర చిక్కుల్లో పడవచ్చు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు సొంతం చేసుకుంటారు. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం.
 
మకరం :- కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణంగా పరిశీలించండి. చెడు స్నేహాలువదలడం వల్ల అభివృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. బ్యాంకింగ్ వ్యవహరాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మీనం :- మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. పారిశ్రామిక రంగంలోని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏమిటి?