23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

రామన్
శనివారం, 22 నవంబరు 2025 (18:43 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తికాగలవు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. సోమవారం నాడు ఒప్పందాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఒంటెద్దు పోకడ తగదు. అనుభవజ్ఞులను సంద్రించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. ఒక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వైద్య, న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. మంగళవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వస్త్ర, పచారి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వెండి, బంగారం వ్యాపారులకు నిరాశాజనకం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం సామాన్యం. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. బుధవారం నాడు దంపతుల మధ్య స్వల్ప కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పట్టు విడుపు ధోరణిలో సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మధ్యవర్తిత్వాలు తగవు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మిత సంభాషణం శ్రేయస్కరం. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య సరైన అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. నూతన వ్యాపారానికి సన్నాహాలు సాగిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అందరితోను మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహయం తగదు. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. సంతానం కృషి ఫలిస్తుంది. పత్రాల్లో కీలక సవరణలు అనుకూలించవు. పట్టుదలతో మరోసారి యత్నించండి. కొత్త పరిచయం ఏర్పడుతుంది. ఒకరి సలహా మీపై చక్కగా పనిచేస్తుంది. ధైర్యంగా ముందుకుర సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువుల ఇంట శుభకార్యానికి హాజరవుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లోనుకావద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. అయిన వారు సహాయ సహకారాలు అందిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తుల ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఔషధ సేవనం క్రమం తప్పకుండా పాటించండి. ఆదివారం నాడు పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. లావాదేవీలు ముందుకు సాగవు. అన్యమస్కంగా గడుపుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సోమవారం నాడు ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ధృఢసంకల్పంతో కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు కలిసివస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. గురువారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ తగదు. అనాలోచిత నిర్ణయం కష్టనష్టాలకు గురిచేస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆరోగ్యం బాంటుంది. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖరీదైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక పత్రాల రెన్యువల్లో అశ్రద్ధ తగదు. ముఖ్యమైన లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరులతో సంప్రదిఈంపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. అవతలివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది, వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. మీపై సన్నిహితుల వ్యాఖ్యలు పనిచేస్తాయి. సమయస్పూర్తితో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. సర్దుబాటు ధోరణలో సమస్కలు పరిష్కరించుకోండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు, దంపతుల మధ్య అకారణ కలహం. అందరితోను మితంగా సంభాషించండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు గణనీయంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణం సజావుగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments