మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానానికి మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. బంధుమిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బుధవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆర్ధిక వివరాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు కృషి, పట్టుదల ముఖ్యం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఒంటెద్దు పోకడ తగదు. మీ నిర్ణయం పైనే సంతానం భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలిజేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును పూర్తిగా తెలుసుకోండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు వెళతారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక సంఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు పథకాలు కలిసిరావు. పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతిలోపం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును స్వయంగా తెలుసుకోండి. మధ్యవర్తులను నమ్మవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. క్రమం తప్పకుండా ఔషధసేవనం పాటించండి. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. అధికారులకు స్థానచలనం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు చేపడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులతో తరచు కాలక్షేపం చేస్తారు. ఇతరుల బాధ్యతలు చేపట్టవద్దు. నచ్చని విషయాలను లౌక్యంగా తెలియజేయండి. దంపతుల మధ్య చిన్న కలహం. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో చిన్న చిన్న చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. మనస్తిమితం ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరవు. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. బుధవారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. పాతమిత్రులతో సంభాషిస్తారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించండి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. చేస్తున్న పనులపై ధ్యాసపెట్టండి. మీ ఏమరుపాటు ఇబ్బంది కలిగిస్తుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. మంగళవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. స్వల్ప అస్వస్తతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అశ్రాంతంగా శ్రమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పొదుపుధనం ముందుగా గ్రహిస్తారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం వల్ల మాటపడవలసి వస్తుంది. ఆప్తుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పరిచయస్తులతో తరచుగా సంభాషిస్తుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అందరితోను సఖ్యతగా మెలగండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుగా భావిస్తారు. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలగిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధసేవనం పాటించండి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. అధికారులకుర స్థానచలనం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇబ్బండి ఒంటెద్దు పోకడ తగదు. సకాలంలో పనులు పూర్తి చేయగల్గుతారు. ప్రముఖులతో పరిచయాలు ఎర్పడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు, కీలక పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవొద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకలు, వనసమారాధనకు సన్నాహాలు సాగిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు నివారించుకుంటారు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అవివాహితులకు శుభయోగం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. సన్మాన సభల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ో