Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

Advertiesment
rashiphal

రామన్

, శనివారం, 15 నవంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు విఆహ్వానం అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవకాశాన్ని దక్కించుకుంటారు. ఖర్చులు అధికం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నింటా మీదే పైచేయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు తగ్గించుకోవటం ఉత్తమం. పెట్టుబడులు కలిసిరావు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. అనుకోని సంఘటనలెదురవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పరిస్థితులు చక్కబడతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పనులు హడావుడిగా ముగిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్తపనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవదీక్షలు, సభ్యతత్వాలు స్వీకరిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. కిట్టనివారితో జాగ్రత్త. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. పాతమిత్రులు తారసపడతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించే సంఘటన ఎదురవుతుంది. పెద్దల చొరవతో సమస్య పరిష్కారమవుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. సంకల్పబలమే మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయులు సాయం అందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?