మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలుంటాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం, కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవచ్చు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. నోటీసులు అందుకుతారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధైర్యంగా యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. ఆలోచనలతో సతమతమవుతారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థల వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించాలి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం.
ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య కొలిక్కివస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఇతరుల విషయంపై అనవసర జోక్యం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిపిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.