Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబరు 20 ఆఖరు తేదీ, SNAP 2025 రిజిస్ట్రేషన్- సింబయోసిస్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ దరఖాస్తుకి చివరి అవకాశం

Advertiesment
Symbiosis MBA Programmes

ఐవీఆర్

, బుధవారం, 12 నవంబరు 2025 (17:11 IST)
సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) ప్రతిష్టాత్మకంగా నవంబరు 20 నిర్వహిస్తున్న సింబయోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్(SNAP)టెస్ట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ విండోను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది MBA అభ్యర్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఐదు దశాబ్దాలకు పైగా విద్యా నైపుణ్యంతో, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన, ఇండస్ట్రీతో సంబంధాలున్న మరియు విద్యాపరంగా కఠినమైన నిర్వహణ విద్యను కోరుకునే విద్యార్థులకు సింబయోసిస్ అనేది ఒక బెస్ట్ ఛాయిస్‌గా మిగిలిపోయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని యూనివర్శిటీ ప్రకటించింది.
 
దరఖాస్తుదారులు గడువుకు ముందే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలని చెప్పింది సింబయోసిస్ యూనివర్సిటీ. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మూడు తేదీలలో నిర్వహించబడుతుంది, అభ్యర్థులు మూడుసార్లు వరకు పరీక్షకు ప్రయత్నించవచ్చు. ఉత్తమ స్కోర్‌ను అడ్మిషన్ ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు.
 
సింబయోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్(SNAP) 2025 కోసం అడ్మిట్ కార్డులు ప్రతి పరీక్ష తేదీకి అనుగుణంగా దశలవారీగా విడుదల చేయబడతాయి. SNAP టెస్ట్ 01 కోసం, అడ్మిట్ కార్డ్ నవంబర్ 28, 2025(శుక్రవారం) నుండి అందుబాటులో ఉంటుంది. పరీక్ష డిసెంబర్ 6, 2025(శనివారం)న నిర్వహించబడుతుంది. SNAP టెస్ట్ 02 కోసం, అడ్మిట్ కార్డ్‌ను డిసెంబర్ 8, 2025 (సోమవారం) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అయితే పరీక్ష డిసెంబర్ 14, 2025(ఆదివారం)న జరగాల్సి ఉంది. అదేవిధంగా, SNAP టెస్ట్ 03 కోసం, అడ్మిట్ కార్డ్ డిసెంబర్ 15, 2025 (సోమవారం) నుండి అందుబాటులో ఉంటుంది. పరీక్ష డిసెంబర్ 20, 2025(శనివారం)న జరుగుతుంది.
 
పరీక్ష ఫలితాల ప్రకటన: జనవరి 9, 2026 (శుక్రవారం)
SNAP 2025 భారతదేశంలోని 79 నగరాల్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 25% నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి ప్రయత్నానికి INR 2,250, ప్రతి ప్రోగ్రామ్‌కు అదనంగా INR 1,000గా ఉంటుంది.
 
ఫైనల్ సెలెక్షన్ ప్రక్రియ(మెరిట్ లిస్టింగ్) ఈ క్రింది వాటిని కలిగి ఉన్న మిశ్రమ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది:
SNAP స్కోర్ (50 మార్కులకు స్కేల్ చేయబడింది)
గ్రూప్ ఎక్సర్‌సైజ్ (10 మార్కులు)
వ్యక్తిగత ఇంటరాక్షన్ (40 మార్కులు)
మొత్తం: 100 మార్కులు
 
SNAP అనేది సింబయోసిస్ యొక్క ప్రీమియర్ MBA ప్రోగ్రామ్‌లకు ఎంట్రన్స్ ఎగ్జామ్. రిజిస్ట్రేషన్లు త్వరలో ముగుస్తున్నందున, అందరు అభ్యర్థులు తమ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మా సంస్థలలో చేరడానికి తదుపరి అడుగు వేయాలని మేము కోరుతున్నాము అని అన్నారు సింంబయోసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్ యూనివర్సిటీ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామకృష్ణన్ రామన్.
 
SIBM పూణే, SICSR, SIMC, SIIB, SCMHRD, SIMS, SIDTM, SCIT, SIOM, SIHS, SIBM బెంగళూరు, SSBF, SIBM హైదరాబాద్, SSSS, SIBM నాగ్‌పూర్, SIBM NOIDA, మరియు SSCANS వంటి MBA ప్రోగ్రామ్‌లకు SNAP పరీక్ష ప్రవేశ ద్వారం.
 
సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) [SIU] విద్యా నైపుణ్యం, ప్రపంచ స్థాయి గుర్తింపు, నిరంతర పురోగతికి నిదర్శనంగా నిలుస్తుంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(NAAC) ద్వారా A++ గ్రేడ్‌తో గుర్తింపు పొందిన SIU, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ద్వారా గుర్తింపు పొందింది. 2025లో భారతీయ విశ్వవిద్యాలయాలలో 24ᵗʰ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్త ఖ్యాతిని మరింత బలోపేతం చేస్తూ, SIU QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో ఆసియాలో టాప్ 200లోకి ప్రవేశించింది, ఆసియాలో 200ᵗʰ, దక్షిణాసియాలో 34ᵗʰ మరియు భారతదేశంలో 20ᵗʰ ర్యాంక్‌ను పొందింది. నాణ్యమైన విద్య, ఆవిష్కరణ మరియు వరల్డ్ ఎంగేజ్ మెంట్ పట్ల దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరికొత్త XSR155తో భారతదేశంలో నూతన యుగంలోకి అడుగుపెట్టిన యమహా