Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 8 నవంబరు 2025 (23:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం మీ ఓర్పునకు పరీక్షా సమయం. కార్యదీక్షతో పట్టుదలతో శ్రమించాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి నిరుత్సాహపడతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టమ్మీద ధనం అందుతుంది. చేపట్టవలసిన పనులను మధ్యలోనే నిలిపివేయవద్దు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం వుంటుంది. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఒక వార్త ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు ఏమరపాటు ఇబ్బందికి దారితీస్తుంది. ముఖ్యులకు వివరణ ఇచ్చుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారానుకూలత వుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కొందరి ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. సంతానానికి శుభ పరిణామాలున్నాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కష్టం వృధా కాదు. త్వరలోనే కృషి ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. సోమవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. సన్నిహితులతో తరతూ కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అందరితో మితంగా మాట్లాడండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన వుండదు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పరిచయస్తులు మీ కార్యదీక్షను స్ఫూర్తిగా తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. సమస్యను సమర్థంగా పరిష్కరిస్తారు. బుధవారం నాడు ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు పురోగతిని సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వినోదాలకు సన్నాహాలు సాగిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. గురువారం నాడు అప్రమత్తంగా వుండాలి. ఆచితూచి అడుగేయండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. పెట్టుబడులకు తగిన సమయం. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహ సంచారం ప్రతికూలంగా వుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఆదివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేస్తున్న పనులపై దృష్టి పెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. లౌక్యంగా మెలగండి. మీ మాటతీరు కొందరికి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్లుగా వదిలేయండి. మంగళవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నం తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదేనని భావించండి. త్వరలో సంతోషకరమైన వార్త వింటారు. సంతానానికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
లావాదేవీలతో తీరిక వుండదు. శారీరక శ్రమ, అకాల భోజనం. ఆలోచనలతో సతమతమవుతారు. కష్టించినా ఫలితం వుండదు. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయానికి తీవ్రంగా స్పందించవద్దు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. శనివారం నాడు చేసిన పనులు మళ్లీ మొదటికే వస్తాయి. ఆదాయవ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరం నిమిత్తం వుంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా వుంచండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం కలుగుతుంది. మరింత ఉత్సాహంగా ముందుకు వెళతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. కీలక పత్రాలు జాగ్రత్త. మీ అలక్ష్యానికి ఇతరులను బాధ్యలు చేయవద్దు. బందువుల రాకతో సంతోషం కలిగిస్తుంది. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానానికి శుభయోగం. గృహమరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో చిన్న చిన్న చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదవకాశం లభిస్తుంది. వేడుకకు హాజరవుతారు. ఇంటిని ర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పధంతో శ్రమించండి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మంగళవారం నాడు ముఖ్యుల ఇంటర్య్వ సాధ్యపడదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ధృఢదీక్షతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. స్నేహ బంధాలు బలపడతాయి. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు అనవసర విషయాలకు దూరంగా వుండటం మంచిది. ఏ విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిస్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. వస్త్రప్రాప్తి, వస్తులాభం వున్నాయి., కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సర్దుకుంటుంది. సంస్థల స్థాపనకు కొంతకాలు వాయిదా వేయండి. చిరువ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఆశాజనకం.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుక ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. ఔషధ సేవనంలో అలక్ష్యం తగదు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. వాక్చాతుర్యంతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది