Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
weekly horoscope

రామన్

, శనివారం, 25 అక్టోబరు 2025 (23:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదునపునకు అవకాశం లేదు. ఖర్చులను తగ్గించుకోవటం శ్రేయస్క. కొత్తయత్నాలు మొదలు పెడతారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహం కలిగిస్తుంది. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. అయిన వారి సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానానికి శుభం జరుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయానికి తగినట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచించండి. ఆదివారం నాడు కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. అనవసర జోక్యం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ కించపరుచవద్దు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య స్వల్ప కలహం. బంధుమిత్రులతో విభేదిస్తారు. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగపరంగా శుభఫలితాలున్నాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారుర. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. చేపట్టిన పనుల పట్ల అశ్రద్ధ తగదు. కార్యదీక్షతో శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం నెరవేరుతుంది. హామీలు నిలబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. విలాసాలు, వినోదాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవకాశాలు చేజార్చుకోవద్దు. బుధవారం నాడు కార్యనిమిత్తం పడిగాపులు తప్పవు. ప్రముఖులను కలిసినా ప్రయోజనం ఉండదు. మొండిగా యత్నాలు కొనసాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒత్తిళ్లకు గురికావద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ఉద్యోగపరంగా విశేష ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో శ్రమిస్తేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. మీ మతిమరుపు ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. ఆపత్సమయంలో పరిచయస్తులు సాయం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. తాత్కాలిక వ్యాపారులకు ఆశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ నిర్ణయంతపై కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. శనివారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ అభిప్రాయాలను సామరస్యంగా తెలియజేయండి. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకోగల్గుతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసపరుస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అప్రియమైన వార్త వినవలసివస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోబలంలో యత్నాలు సాగించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ముఖ్యుల కలయిక పిలపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. విజ్ఞతతో సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆశావహదృక్పథంతో మెలగండి. అవాంతరాలు ఎదురైనా పనులు నిలిపివేయొద్దు. అవకాశం చేజారిపోతుంది. ఇదీ ఒకందుకు మంచికే. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. పరిస్థితులు సర్దుకుంటాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వృత్తిపరంగా విశేషఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం కలిసివచ్చే సమయం. కష్టం ఫలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సంఘటన మీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నూతన పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నిర్విరామంగా శ్రమిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానానికి శుభయోగం. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగ బాధ్యతల పట్ల అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. దైవదీక్షలు చేపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి సామాన్యంగా ఉంది. కార్యసిద్ధికి పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించి భంగపడతారు. కొందరి ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురువారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ ప్రతిపాదనలనకు అభ్యంతరాలెదురవుతాయి. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. కొత్త వ్యాపారాలు చేపడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధృఢసంకల్పంతో శ్రమిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. శనివారం నాడు కొత్తసమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. దూకుడుగా వ్యవహరించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పెద్దమొత్తం చెల్లింపుల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మీ శ్రీమతి సలహా తీసుకోండి. మీ జోక్యంతో ఒక వివాదం సద్దుమణుగుతుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను ఆశ్రయించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం