Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-10-2021 గురువారం దినఫలాలు .. సాయిబాబాను ఆరాధించిన శుభం...

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- వృత్తి వ్యాపారాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత వల్ల భవిష్యత్తు పట్ల భరోసా వస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించు కుంటారు. పెద్దలను అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం. బంధువుల విషయంలో తలదూర్చడం కంటే మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. మీ సంతానం మీ మాటను గౌరవిస్తారు.
 
మిథునం :- స్త్రీలు గృహోపకరణాలు కొనుటపట్ల ఆసక్తి చూపుతారు. రాబడికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు చవిచూడాల్సివస్తుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. దీర్ఘకాలంగా కోర్టులో ఉన్న కేసు ఒకటి మీకు ఊరటనిస్తుంది.
 
కర్కాటకం :- వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పైఅధికారులను మెప్పిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
సింహం :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావంతో శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలకు పని వారితో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మిత్రులను కలుసుకుంటారు. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కన్య :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. ఇంటా బయట అధిక కృషి అనంతరం మంచి ఫలితాలను పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
తుల :- స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. నూతన టెండర్ల విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు చేజిక్కించుకుంటారు. రాజకీయనాయకులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
 
వృశ్చికం :- మీ సంతానం వివాహం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదాపడతాయి. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఆర్థికంగా బాగుంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- హోటల్, తినుబండారాలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి బాగా ఉంటుంది. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గృహ మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
కుంభం :- గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి. మీ యత్నాలకు కుటుంబీకుల సహకారం అందుతుంది. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన వస్తువులు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.
 
మీనం :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. సత్కాలం ఆసన్నమైంది, మీ ఆలోచనలు, పథకాలు అమలు చేయండి. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

తర్వాతి కథనం
Show comments