Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-10-2021 శనివారం దినఫలాలు .. శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

Advertiesment
16-10-2021 శనివారం దినఫలాలు .. శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...
, శనివారం, 16 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది.
 
వృషభం :- పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు చికాకులు అధికం. మీ శ్రీమతి తరపు బంధువులతో వివాహాది విషయాలు ప్రస్తావిస్తారు. విద్యార్థులకు నూతన వాతావరణం సంతృప్తినిస్తుంది. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు. ప్రయాణాల్లో అసౌకర్యం, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహనముఖ్యం.
 
మిథునం :- పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన, ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తుల ఆందోళనకు కార్మిక యూనియన్ల మద్దతు లభిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం కలిసివస్తుంది. వైద్యరంగాలవారికి ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కర్కాటకం :- విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలు పంతాలకుపోకుండా సంయమనంతో మెలగాలి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాధికారులతో జరిపిన చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది.
 
సింహం :- దైవ దర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కొన్ని కీలకమైన విషయాలు కుటుంబీకులతో చర్చిస్తారు. ప్రయాణాల్లో పాత మిత్రులు, అయిన వారు తారసపడతారు. వ్యాపారాల్లో అమలు చేసిన స్కీములు మెరుగైన ఫలితాలిస్తాయి.
 
కన్య :- భాగస్వామిక సమావేశాలు, సభలు, సామాజిక కార్యక్రమాలతో క్షణం తీరిక ఉండదు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దంపతుల ఆలోచనలు పరస్పరం విరుద్దంగా ఉంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
తుల :- విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఆత్మీయులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి. గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి బహుమతులు, ఆహ్వానం అందుతుంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చులు అధికమైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు తోటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఆకాలభోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. ఒక అవకాశం చేజారినా మరొక అవకాశం వెంటనే లభిస్తుంది. దైవ, సేవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- స్త్రీలు వస్త్ర, బంగారం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికం, ఆడంబరాలు, దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమర్థత కనబర్చి అధికారుల గుర్తింపు పొందుతారు.
 
కుంభం :- రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికం. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్ధులలో మందకొడితనం పెరుగుతుంది.
 
మీనం :- ఉద్యోగస్తులకు స్థానచలనం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ధనం మితంగా వ్యయం చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించటం క్షేమదాయకం. బంధువులతో సఖ్యత లోపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-10-2021 శుక్రవారం దినఫలాలు .. రాజరాజేశ్వరి దేవిని ఆరాధించినా..