Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-10-2021 - సోమవారం మీ రాశి ఫలితాలు... అమ్మవారిని పున్నాగపూలతో..?

Advertiesment
11-10-2021 - సోమవారం మీ రాశి ఫలితాలు... అమ్మవారిని పున్నాగపూలతో..?
, సోమవారం, 11 అక్టోబరు 2021 (05:00 IST)
11-10-2021 - సోమవారం.. శ్రీ ప్లవనామ సం|| ఆశ్వయుజ శు| పంచమి ఉ. 6.31 షష్ఠి తె.4.08 జ్యేష్ఠ సా.5.55 రా.వ.1.22 ల 2.52 పదు.1213ల 1.01 పుదు.2.36 ల 3.23. అమ్మవారిని పున్నాగపూలతో పూజించి అర్చించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం:- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.
 
వృషభం :- స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారులతో తనిఖీలు, పర్యటనలు తప్పవు. కోర్టు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మిధునం:- రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థుల అత్యుత్సాహం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
కర్కాటకం:- మీ యత్నాలకు సన్నిహితులు అండగా నిలబడతారు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
సింహం: - మీ మిత్రులలో ఒకరి వైఖరి మీకు చికాకులు కలిగించును. పాత రుణాలు తీరుస్తారు. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. దైవ, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అయిన వారికి వివాహ సమాచారం అందిస్తారు.
 
కన్య:- కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. కిరణా, ఫాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు.
 
తుల: - మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. రాజకీయ, సినీ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యతే గాని ఆర్ధిక స్థితి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం.
 
వృశ్చికం:- మీ పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. పెద్ద ప్రమేయంతో ఆస్తి పంపకాల సమస్య పరిష్కారమవుతుంది.
 
ధనస్సు: - ప్రింటింగ్ రంగాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. దుస్వప్నాలు మీకెంతో చికాకు, ఆందోళనలను కలిగిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ గౌరవ ప్రతిష్టలు భంగం కలుగకుండా జాగ్రత్తగా వ్యహరించండి.
 
మకరం:- యాదృచ్ఛికంగా మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంగీత, సాహిత్య కళా రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది.
 
కుంభం:- కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ధనం రాకడ,ధనం పోకడ సరిసమానంగా ఉండటంవల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి సమస్యలు అధికం అయినా తేలికగా పరిష్కరిస్తారు.
 
మీనం:- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా అపోహలు తలెత్తగలవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రి ఉపవాసాల్లో రాక్ సాల్ట్‌ను ఎందుకు ఉపయోగిస్తారంటే?