Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-10-2021 ఆదివారం దినఫలాలు .. ఆదిత్య హృదయం చదివిన...

Advertiesment
17-10-2021 ఆదివారం దినఫలాలు .. ఆదిత్య హృదయం చదివిన...
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, ఆకస్మిక ధనప్రాప్తి వంటి శుభపరిణమాలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం మంచిదికాదు.
 
వృషభం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం :- కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయమవుతుంది. కుంటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కిరాణా, ఫ్యాన్యీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం.
 
కర్కాటకం :- ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
సింహం :- షాపులలో పనిచేసే వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. మత్స్య కోళ్ళ గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
 
కన్య :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులుబాటు ఉంటుంది. బాకీలు, ఇంటి అద్దెలు తదితర ఆదాయాలను సౌమ్యంగా వసూలు చేసుకోవాలి.
 
తుల :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బంధువుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- గృహోపకరణాల కొనుగోలుకై చేయుయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ముఖ్యుల విషయాలు చర్చకు వచ్చిన వాయిదా వేయండి.
 
ధనస్సు :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అంత సఖ్యత ఉండదు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగి గౌరవాభిమానాలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలున్నాయి.
 
మకరం :- ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన, ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో మెళుకువ చాలా అవసరం. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
కుంభం :- స్త్రీలకు పని ఒత్తిడి, హడావుడి అధికం. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. భాగస్వామ్య రంగంలో వారికి చికాకులు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మీనం :- కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులా మాసం పూజ కోసం నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం