Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-12-2023 శనివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన శుభం...

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (04:01 IST)
మేషం :- వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలపై చుట్టుప్రక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం, అభివృద్ధి లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియచేయకండి.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల ఆర్యోగంలో మెళుకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం :- మీ యత్నాలకు బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
కర్కాటకం :- రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు.
 
సింహం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
కన్య :- ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు.
 
తుల :- ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం మంచిది. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
వృశ్చికం :- మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికస్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం అందుతుంది.
 
మకరం :- కుటుంబీకుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. గృహములో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారం చుడతారు.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు ఆర్జనపట్లల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ధనం మితంగా వ్యయం చేయటం శ్రేయస్కరం. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

తర్వాతి కథనం
Show comments