Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

27-12-2023 బుధవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం...

Advertiesment
Astrology
, బుధవారం, 27 డిశెంబరు 2023 (05:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర బ|| పాడ్యమి తె.5.45 ఆరుద్ర రా.11.12 ఉ.వ.6.59 ల 8.39. ప. దు. 11. 28 ల 12.12.
 
కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు.
 
వృషభం :- భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. స్థిరచర మూలక ధనం అందుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు.
 
మిథునం :- తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆస్తి వ్యవహరాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆడంబరాలు, అలంకారాలపట్ల మక్కువ పెరుగుతుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌కు ఆటంకాలెదురవుతాయి. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. రాజకీయలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళుకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలి. ప్రయాణం వాయిదా వేసుకోవటం ఉత్తమం.
 
కన్య :- మీ శ్రీమతి సలహా పాటింటం వల్ల మేలే జరుగుతుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, చికాకులకు గురవుతారు. శ్రమాధిక్యత, వాతావరణలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టి పెడతారు.
 
తుల :- బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- కూర, పండ్ల, కొబ్బరి, ధాన్య స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు చురుకుతనం, పనియందు ద్యాస చాలా అవసరం.
 
మకరం :- ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేధాలు తలెత్తుతాయి. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కుంభం :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోవారు అచ్చుతప్పుల వల్ల మాటపడతారు. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. పెద్దమొత్తం సరుకు నిల్వలో వ్యాపారులు అప్రమత్తంగాఉండాలి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలవు. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మీనం :- ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనిచండి. డాక్టర్లు శస్త్రచికిత్సలువిజయ వంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం కదలికలపై దృష్టి సారించండి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్నిగోప్యంగా ఉంచండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు చురుకుగా సాగుతాయి. పని వారితో ఇబ్బందులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గశిర పౌర్ణమి.. దత్తాత్రేయ జయంతి.. నెయ్యి, నువ్వుల దీపం..