Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26-12-2023 మంగళవారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం..

Weekly Horoscope
, మంగళవారం, 26 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ॥ పూర్ణిమ తె.5.14 మృగశిర రా.10.16 వర్జ్యం లేదు.
ఉ.దు. 8.32 ల 9.16 రా.దు. 10. 32 ల 11.24.
 
రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయటం క్షేమం కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్ధంగా నడుపుతారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు.మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మిథునం :- హోల్సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. మీ భర్తలో ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది.
 
కర్కాటకం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధవహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది.
 
సింహం :- ఖర్చులు అధికమవుతాయి. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలుగుతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
కన్య :- ప్రేమికులకు తొందరపాటు తగదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం మంచిది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం.
 
తుల :- ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగా సాగుతాయి. ఒక కార్య సాధనకోసం ఒకటికి పది సార్లు ఆలోచించవలసి ఉంటుంది. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
వృశ్చికం :- వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు.
 
ధనస్సు :- మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పంతాలు, పటింపులకు ఇది సమయం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం.
 
మకరం :- భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వస్తాయి. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కుంభం :- ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రుల కలయికతో గతవిషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం.
 
మీనం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి... నేతల శుభాకాంక్షలు