Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-12-2023 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

Advertiesment
Shukra Vakri 2023
, ఆదివారం, 24 డిశెంబరు 2023 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం :- విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
మిథునం :- పెద్దల ఆర్యోగంలో మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
 
కర్కాటకం :- స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకు పోవటం క్షేమదాయకం. మీ కళత్రమొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురౌతారు.
 
సింహం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ధనం కంటె ఇచ్చిన మాటకు విలువనిస్తారు. విదేశీ చదువులు, నిరుద్యోగులు ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు.
 
కన్య :- శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి. రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది.
 
తుల :- మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెళకువ వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. గతంలో ఇచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
ధనస్సు :- కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా పోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవకార్యాలు, వైద్యసేవలకు బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మకరం :- వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. వాహనం నిదానంగానడపటం క్షేమదాయకం. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. ఆస్తి పంపకాల వ్యవహారంఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఏ విషయంపైనా శ్రద్ధ వహించలేరు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. 
 
కుంభం :- ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. మీ ఆరాటం, ఉత్సాహాలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది.
 
మీనం :- సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. స్థోమతకు మించినధనసహాయం, హామీలు ఇరకాటానికి గురిచేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి?