Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-12-2023 గురువారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం...

Advertiesment
panchangam
, గురువారం, 28 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| విదియ పూర్తి పునర్వసు రా.12.39 ఉ.వ.11.56 ల 1.37.
ఉ.దు. 10.01 ల 10.45 పు.దు. 2.25 ల3.09.
 
అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- బ్యాంకు పనులు హడావిడిగా సాగుతాయి. విద్యార్థుల వైఖరి ఉపాధ్యాయులకు నిరుత్సాహం కలిగిస్తుంది. కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ స్థానచలనానికి ఆస్కారం ఉంది. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- ముఖ్యమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఎదురైన పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బరువు భాద్యతలు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. మీచుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. పత్రికాసంస్థలలోని వారికి ఊహించని చికాకు లెదురవుతాయి. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసివస్తాయి.
 
కర్కాటకం :- వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా ఉండదు. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడంవల్ల ఇబ్బందులకు గురి కావలసివస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒక సష్టం మరో విధంగా పూడ్చుకుంటారు.
 
కన్య :- గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. కోర్టుకు హాజరవుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. విద్యార్ధులకు కోరుకున్న కోర్సులలో అవకాశం లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. పొదుపు చేయాలన్న మీ యత్నం ఏ మాత్రం సాధ్యం కాదు. ఖర్చులు పెరగటంతో అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు.
 
వృశ్చికం :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది. సభలు, సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. బ్యాంకు ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
 
ధనస్సు :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో అవకాశం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహం, ఆందోళన కలిగిస్తుంది. బంగారు, వెండి, తాకట్టు వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉండగలదు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
మకరం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందు లెదురవుతాయి. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా ఉంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది.
 
కుంభం :- బ్యాంకింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగటంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పొదుపు పథకాలు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. బ్యాంకు లోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాల ముఖ్యోద్దేశ్యం నెరవేరుతుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-12-2023 బుధవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం...