Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-10-2023 గురువారం రాశిఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి...

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం।। ఆశ్వీయుజ శు॥ ద్వాదశి ఉ.8.01 త్రయోదశి తె.5.48 పూర్వాభాద్ర ఉ.10.48 రా.వ. 7.48 ల 9.17. ఉ.దు. 9.50 ల 10.38 ప.దు.2.35ల 3.22.
 
వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి, మనోసిద్ధి పొందుతారు.
 
మేషం :- రాబడికిమించిన ఖర్చుల వల్ల ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృషభం :- సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఊహించని ప్రయాణాలు సంభవం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్నేహితులు, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- భార్య, భర్తల మధ్యమనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. స్త్రీలు తాము అనుకున్నది సాధించగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.
 
కన్య :- వృత్తి వ్యాపార రంగలల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. స్త్రీలకు షాపింగుల్లో నాణ్యతను గమనించాలి. విద్యార్థులు వాహనం నడుపునప్పుడు ఏకాగ్రత మెళకువ అవసరం.
 
తుల :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. చిన్ననాటి వ్యక్తుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.
 
ధనస్సు :- ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చేపట్టిన వ్యాపారంలో నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు తాత్కలిక అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పెద్దల మాటను శిరసా వహిస్తారు.
 
మకరం :- కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. విద్యార్ధులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది.
 
కుంభం :- ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
మీనం :- విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేతి వృత్తి, వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments