Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-10-2023 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

Advertiesment
Astrology
, బుధవారం, 25 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ ఏకాదశి ఉ.10.23 శతభిషం ప.12.27 సా.వ.6.24 ల 7.53. ప. దు. 11. 26 ల 12.13.
సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. చిన్న తప్పిదమే పెద్ద సమస్య అయ్యే ఆస్కారం ఉంది. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం.
 
వృషభం :- మీ పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా లభించిన ప్రతిఫలం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
మిథునం :- దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆశాభావంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిమ్ములను చూసి అసూయపడే వారు అధికమవుతారు. 
 
కర్కాటకం :- వ్యాపారస్తులు చక్కనిమాటతీరు, లాభదాయక స్కీంలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. షాపు గుమస్తాలు, పనివారలకు ఆదాయాభివృద్ధి. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మొక్కుబడులు, రుణాలు తీర్చుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. జరిగిన తప్పిదానికి చింతించకండి.
 
సింహం :- ఉద్యోగస్తులకు పనిఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. దైవదర్శనాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు, పొదుపు పథకాల దిశగా ఆలోచిస్తారు. స్త్రీలకు టీ.వీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. మిత్రులు పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి.
 
కన్య :- స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. స్త్రీల ఏమరుపాటు వల్ల ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి.
 
తుల :- స్త్రీలలో ఒత్తిడి, హడావిడి చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. గత అనుభవంతో ఒక సమస్యను అధికమిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు భంగం కలుగకుండా జాగ్రత్తగా వ్యహరించండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలుతప్పవు.
 
వృశ్చికం :- రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్ధిక సంతృప్తి ఉండదు. వ్యాపారాల్లో అమలు చేసిన స్కీములు మెరుగైన ఫలితాలిస్తాయి.
 
ధనస్సు :- ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. కుటుంబీకుల కోసంధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.
 
మకరం :- ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలపై శకునాలు, ఎదుటివారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పిదమైనా సునిశితంగా ఆలోచించటం క్షేమదాయకం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కుంభం :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు.
 
మీనం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి పెద్ద సంస్థల నుండి అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-10-2023 మంగళవారం రాశిఫలాలు - మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు....