Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-10-2023 శుక్రవారం రాశిఫలాలు - సరస్వతీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Advertiesment
Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ షష్ఠి రా.9.05 మూలరా.7.31 సా.వ.5.57 ల 7.31. తె.వ. 4.42 ల ఉ. దు. 8. 16 ల 9.03 ప. దు. 12.12 ల 1.00.
 
సరస్వతీదేవిని పూజించి, అర్చించిన శుభం కలుగుతుంది.
 
మేషంన:- రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
మిథునం :- రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమవుతున్నారని గమనించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. స్త్రీలకు స్కీములు, ప్రకటనల పట్ల అవగాహన అవసరం.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అతిథిమర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి.
 
సింహం :- స్త్రీలకు పొరుగు వారిలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.
 
కన్య :- ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తీసుకోక తప్పవు. ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకైయత్నాలు ఆటంకాలు తప్పవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
తుల :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. 
 
వృశ్చికం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. రావలపినధనంలో కొంత మొత్తం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో ఇబ్బందులుండవు. గృహ నిర్మాణాల ప్లానుకు ఆమోదం లభించటంతోపాటు లోన్లు మంజూరవుతాయి.
 
మకరం :- ప్రయత్నపూర్వకంగా కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. తొందరపడి హామీలివ్వటం మంచిది కాదు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు.
 
కుంభం :- ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు పెరిగినా మీఅవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటినుంచో ఆగి వున్న పనులు పునః ప్రారంభమవుతాయి.
 
మీనం :- అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. శస్త్ర చికిత్సలు విజయవంతం కావటంతో వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమికుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ