Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-10-2023 మంగళవారం రాశిఫలాలు - దుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించిన...

Advertiesment
kumbha rashi
, బుధవారం, 18 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ చవితి రా.11.25 అనూరాధ రా.8.25 రా.వ.1.57 ల 3.32. ప. దు. 11. 26 ల 12.13.
 
దుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించిన అనుకున్నపనులు నెరవేరుతాయి.
 
మేషం :- దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృషభం :- వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కుంటారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడంవల్ల విభేదాలు తలెత్తవచ్చు.
 
మిథునం :- వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సోదరీ సోదరుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు పదే పదే జ్ఞప్తికి వస్తాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. వేధింపుల అధికారి బదిలీ వార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. 
 
సింహం :- ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. హోల్ సేల్, రిటైల్ పెద్ద మొత్తం స్టాక్‌లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి.
 
కన్య :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.
 
తుల :- శత్రువులు మిత్రులగా మారి సహాయాన్నిఅందిస్తారు. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్‌ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి.
 
వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తరచూ సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.
 
ధనస్సు :- రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలను పొందగలుగుతారు. మీ యత్నాల్లో ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యంకుదుటపడుతుంది.
 
మకరం :- రవాణా కార్యక్రమాలలో చురుకుదనం కానవస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు.
 
కుంభం :- స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ద్విచక్ర వాహనచోదకులకు దూకుడు తగదు. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మీనం :- మీ సంతానం మొండి వైఖరిమీకు ఎంతో చికాకులను కలిగిస్తుంది. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారు, ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-10-2023 మంగళవారం మీ దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...