Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-10-2023 మంగళవారం మీ దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Advertiesment
kumbha rashi
, మంగళవారం, 17 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం॥ ఆశ్వీయుజ శు॥ తదియ రా.11.55 విశాఖ రా.8.12 రా.వ.12.14 ల 1.51. ఉ. దు. 8.16 ల 9.04 రా.దు. 10.37 ల 11.26.
 
కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం :- మీ మాటకు సంఘంలోను, కుటుంబంలోను గౌరవం లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థినుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృషభం :- మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఒక ముఖ్య విషయమై న్యాయసలహా పొందవలసి వస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిసగా ఆలోచనలు చేస్తారు.
 
మిథునం :- ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వాని చెల్లించాల్సిన పన్నులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
కర్కాటకం :- అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది.
 
సింహం :- మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు శుభదాయకం. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కావస్తుంది.
 
కన్య :- కొన్ని వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగంలోని వారికి గణనీయమైన అభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
తుల :- వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ సంతానం పై చదువులపట్ల దృష్టి సారిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఉద్యోగస్తుల పనితీరుకు తగిన ప్రతిఫలంలభిస్తుంది. కోర్టు వ్యవహరాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు.
 
వృశ్చికం :- రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ పని వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసివుంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిదికాదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
మకరం :- కుటంబ, ఆర్థిక విషయాలు కలవరపరుస్తాయి. పత్రికా సిబ్బందికి పనిభారం, ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఇతరులను మీ వ్యక్తిగత విషయాలకు దూరంగాఉంచండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారిక పర్యటనలు, యూనియన్ వ్యవహారాలతో క్షణంతీరిక ఉండదు. స్త్రీలలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. అల్లర్లు, ఆందోళనలకు విద్యార్థులు దూరంగాఉండాలి. పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
మీనం :- బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రులలో ఏ హోమం చేస్తే మేలు జరుగుతుందో తెలుసా?