తిరుమల పుణ్యక్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవలో భాగంగా, స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహించనున్నారు.
ఈ దసరా బ్రహ్మోత్సవాలపై తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గరుడ సేవను కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, తితిదే ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అదుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్సనం చేసుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన తెలిపారు. స్వామివారి సేవలో పాల్గొనం అనేది జన్మజన్మల పుణ్యఫలం, అదృష్టమని తెలిపారు.