Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-10-2023 శనివారం రాశిఫలాలు - అమ్మవారిని ఆరాధించి ఆవుపాలను తీర్థంగా...

astrolgy
, శనివారం, 21 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ సప్తమి రా.7.21 పూర్వాషాఢ సా. 6.30 ఉ.శే.వ. 6. 14కు
రా.వ.2.04 ల 3.35. ఉ.దు.5.54 ల7.28.
 
అమ్మవారిని ఆరాధించి ఆవుపాలను తీర్థంగా తీసుకున్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- భాగస్వామిక వ్యాపారాలలో కష్టనష్టాలు ఎదుర్కొవలసివస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దుబారా ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహరాలల్లో పురోగతి కనిపిస్తుంది.
 
వృషభం :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలలో జయం చేకూరును. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వివాదాస్పదాలలో తలదూర్చకండి. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి.
 
మిథునం :- పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. బంధు మిత్రులతో పట్టింపులు, విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ప్రింటింగ్ రంగాలవారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన లుంటాయి.
 
కర్కాటకం :- తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ముందు చూపుతో వ్యవహరించండి. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి అవసరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
సింహం :- ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్తప్రణాళికలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కన్య :- ఆర్థిక పరిస్థితిలో ఆశిస్తున్న మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పాత వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి.
 
తుల :- పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాల సందర్శనాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం.
 
వృశ్చికం :- ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడకులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పెద్దలతో పరస్పర ఏకీభావం కుదురుతుంది. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
ధనస్సు :- రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
మకరం :- మీ సంతానం ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెలకువ అవసరం. మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవ, పుణ్య కార్యాలకుసహాయ సహకారాలు అందిస్తారు.
 
కుంభం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో అటంకాలు ఎదుర్కుంటారు. దైవ సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థినులు పరీక్షల్లో విజయంసాధిస్తారు.
 
మీనం :- ముఖ్యుల కోసం షాపింగులో చేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించటం క్షేమదాయకం. దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-10-2023 శుక్రవారం రాశిఫలాలు - సరస్వతీదేవిని పూజించి, అర్చించిన శుభం...