Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-10-2024 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

రామన్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు పురమాయించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు సామాన్యం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఎవరి సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం సన్నిహితులతో నజిసంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. అపరిచితులతో జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు సాగవు. పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార జయం పొందుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పొగిడే వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. కీలక పత్రాలు అందుతాయి. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై సీఐ అత్యాచార యత్నం, పరారీలో పోలీసు అధికారి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే లైనుకి రూ. 2,245 కోట్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం

సౌదీలోని అల్ ఉలాలో పురాతన మాస్టర్ పీస్‌లను ప్రదర్శించనున్న నేషనల్ ఆర్కియోలాజికల్ మ్యూజియం ఆఫ్ నేపుల్స్

ఫ్రస్టేషన్‌లో జగన్, అందుకే నారా లోకేష్ 'పప్పు' అంటూ చిందులు

వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఇంటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

20-10-2024 నుంచి 26-10-2024 వరకు మీ వార ఫలితాలు

19-10-2024 శనివారం దినఫలితాలు - ప్రతి విషయంలోనూ సహనం వహించండి...

శనివారం ఉపవాసం వుంటున్నారా?

శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టుమార్గం రీఓపెన్

1,000 రాగి కలశాలతో మంత్రాలయంలో పవిత్ర క్షీరాభిషేకం (video)

తర్వాతి కథనం
Show comments