Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-10-2024 శుక్రవారం నాటి అదృష్ట రాశిఫలాలు

Advertiesment
astro1

రామన్

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా అడుగులేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎదురుచూస్తున్న పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులతో జాగ్రత్త. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అయిన వారితో సంభాషిస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చేస్తున్న పనులపై ధ్యాస పెట్టండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆరోగ్యం బాగుంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను నిరూపించుకుంటారు. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఖర్చులు అధికం. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.. ఖర్చులు అదుపులో ఉండవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నోటీసులు అందుకుంటారు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. గ్రహం సందడిగా ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. ధనలాభం ఉంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రియతములతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-10-2024 గురువారం రాశి ఫలితాలు- నిరుత్సాహం వీడితే..?