Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 12 March 2025
webdunia

19-10-2024 శనివారం దినఫలితాలు - ప్రతి విషయంలోనూ సహనం వహించండి...

Advertiesment
astro2

రామన్

, శనివారం, 19 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతి విషయంలోను సహనం వహించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు చికాకుపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అన్యమనస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనులు ఒక పట్టాన సాగవు. ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆప్తులతో సంభాషిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కీలక పత్రాలు అందుతాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిచయాలు బలపడతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ఖర్చులు సంతృప్తికరం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెద్దలను సంప్రదిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. వివాదాలకు దిగవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. ఆహ్వానం అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పొగిడేవారితో జాగ్రత్త. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టుమార్గం రీఓపెన్