Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-05-202 ఆదివారం దినఫలాలు - ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి...

రామన్
ఆదివారం, 19 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ ఏకాదశి ప.1.09 హస్త రా.2.48 ఉ.వ.9.31 ల 11.18. సా.దు.4.34 ల 5.25.
 
మేషం :- విందులలో పరిమితి పాటించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు.
 
వృషభం :- ఏ.సి, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు. రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
మిథునం :- ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షలలో విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
కర్కాటకం :- వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. మీ సంతానం రాక కోసం ఎదురు చూస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. రావల్సిన మొత్తం వాయిదా పడతాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి. ముఖ్యుల రాకపోకలు అధికవుతాయి.
 
కన్య :- వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా సమసిపోతాయి. సమయానికి సహకరించని మిత్రులవల్ల ఒకింత ఇబ్బందు ఎదుర్కుంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. టి.వి. రేడియో రంగాలవారికి అనుకూలం.
 
తుల :- వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. సన్నిహితులతో కలిసి విందుల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం.
 
వృశ్చికం :- దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తనం కూడదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
ధనస్సు :- విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలించవు. కళలు, క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రముఖుల కలయికతో మీ సమస్య ఒకటి సానుకూలమవుతుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
మకరం :- మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. విందు, వినోదాల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. మీ ఆశయ సాధనకుఉన్నత స్థాయి వ్యక్తులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు.
 
కుంభం :- మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలుతప్పవు.
 
మీనం :- కొన్ని సమస్యలుచిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. విదేశాల్లోని అభిమానుల క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు నరాలకు, కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments