Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 16 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ అష్టమి ఉ.7.20 మఘ రా.7.10 ఉ.వ.6.03 ల 7.48 కె.వ.3.59ల ఉ.దు. 9.50 ల 10.40 ప. దు. 2. 53 ల 3.43.
 
మేషం :- రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. ఏసీ కూలర్, మెడికల్, రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం.
 
వృషభం :- ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పెట్టుబడులలో కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మనశ్శాంతి లోపం అధికమవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ఋణ యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం. 
 
మిథునం :- కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని పనులు చివరిలో వాయిదావేస్తారు. బంగారు, వెండి, వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- గృహంలో విలువైన వస్తువులు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకోని అహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
 
సింహం :- ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలను సంతృప్తికరంగా రాయగల్గుతారు.
 
కన్య :- భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
తుల :- లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు.
 
వృశ్చికం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొనటంతో పాటు పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికివస్తారు.
 
ధనస్సు :- ఇంట పెద్దమొత్తంలో ధనం ఉంచుకోవటం శ్రేయస్కరంకాదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో చికాకులు తప్పవు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి యత్నించండి. మీకొచ్చిన సమస్యలు తాత్కాలిమే. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి.
 
మకరం :- ఒక వ్యవహారం అనుకూలించటంతో అమితోత్సాహం చెందుతారు. విలువైన వస్తువులు కొనుగోలులో తొందరపాటు కూడదు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్తపడండి.
 
కుంభం :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. క్యాటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రయాణాలలో అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
మీనం :- కుటుంబీకులు, ఆత్మీయుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకమని గమనించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...