Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

Advertiesment
Astrology

రామన్

, మంగళవారం, 14 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ సప్తమి పూర్తి పుష్యమి ప.3.07 తె.వ.4.53 ల ఉ.దు. 8.07 ల 8.58 రా.దు. 10.48 ల 11.33.
 
మేషం :- వృత్తి వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురించగలవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ధనం ఏమాత్రం నిల్వచేయలేక పోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
వృషభం :- కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసివస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.
 
మిథునం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్ లోపం, కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఆరోగ్య, ఆహార విషయంలో శ్రద్ధ అవసరం.
 
కర్కాటకం :- మిమ్మల్ని అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్ధించవచ్చు జాగ్రత్త వహించండి. సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పథకాల్లో పనివారితో లౌక్యం అవసరం.
 
సింహం :- కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. తీర్థియాత్రలు, దూరప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఆశాజనకం. ఇతరుల ద్వారా మీ పనులు నెరవేర్చు కొనుటకై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
కన్య :- ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. అధ్మాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా వృత్తులలో వారికి కలిసి రాగలదు. స్త్రీల వాక్ చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలుతలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. ఒక వ్యవహారంలో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయానికి కుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- కొంతమందిమిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి యత్నిస్తారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పసులు చురుకుగా సాగటంతో ఒకింత మనశ్శాంతి పొందుతారు. భాగస్వామ్యుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు పట్టుదల, మొండితనంగా వ్యవహరించి అయిన వారికి దూరమవుతారు.
 
ధనస్సు :- శత్రువులు మిత్రులుగా మారి సహయ సహకారాలు అందిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు మందకొడిగా వుంటుంది. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన విషయంలో పునరాలోచన అవసరం.
 
మకరం :- స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏదైనా ఆకస్మికంగా అమ్మే అవకాశం ఉంది. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులుఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాల్లో ఏకాగ్రత వహించండి.
 
కుంభం :- బంధువర్గాల నుండి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాలు వెళ్ళే యత్నాలలో సఫలీకృతులవుతారు. ప్రముఖుల కలయికతో మీ సమస్య ఒకటి సానుకూలమవుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిదానంగా నిలదొక్కుకుంటారు.
 
మీనం :- మీ సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఏ మాత్రం పొదుపుసాధ్యంకాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?