Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

astrolgy

రామన్

, శనివారం, 18 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ దశమి ఉ.11.06 ఉత్తర రా.12.14 ఉ.వ.5.36 ల 7.23. ఉ.దు.5.37 ల 7.18.
మేషం :- ఆర్థిక చికాకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కొంత మంది మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.
 
వృషభం :- చిట్ ఫండ్, ఫైనాన్సు రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీరు స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ మాట మంచితనమే మీకు శ్రీరామ రక్ష. క్రీడారంగాల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మిథునం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి కరంగా వుండగలదు. నిరుద్యోగలు ఇంటర్వ్యూలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పనిచేసే చోట కించెత్తు లోపాన్ని చూపించి ఎదుటి వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన బకాయిలు కొంత ముందు వెనుకలగానైనా అందుటవలన ఆర్థిక ఇబ్బంది అంటూ వుండదు. చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
సింహం :- మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. పరిచయాలేర్పడతాయి. దృఢ సంకల్పం ద్వారా అన్ని కష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం.
 
కన్య :- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపు సాధ్యం కాదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
తుల :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్నిపాలు పొందుతారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు.
 
వృశ్చికం :- విద్యుత్, ఏ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. పాత రుణాలు తీర్చటంతోపాటు కొత్త పరికరాలు అమర్చుకుంటారు. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. రాజకీయ, రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
ధనస్సు :- సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. లక్ష్యసాధనలో మీ అనుభవం ఉపయోగపడుతుంది.
 
మకరం :- ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కారాలంను సద్వినియోగం చేసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. విదేశీ యత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల సహకారం పొందుతారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. జీవితభాగస్వామి సలహాలతో ముదుకుసాగుతారు.
 
మీనం :- చిట్ ఫండ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా సంస్థలోని వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో జయం, మొండిబాకీలు వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. మీ ప్రియతముల పట్ల, ముఖ్యల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...