Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-08-2022 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం...

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రకటనలు, స్కీంల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరం. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
 
మిథునం :- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలిస్తాయి.
 
కర్కాటకం :- బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాల నివ్వగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. విందులలో పరిమితి పాటించండి.
 
సింహం :- ఆత్మీయులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు అందజేస్తారు. రచయితలకు, పత్రికా రంగాల వారికి కీర్తి, గౌరవాలు లభిస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించటంతో పాటు శస్త్రచికిత్సలు, ఔషధసేవలు అవసరమవుతాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటనఎంతో ఆసక్తి కలిగిస్తుంది.
 
వృశ్చికం :- బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు, ఆందోళనలు వంటివి తలెత్తుతాయి. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు.
 
మకరం :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అపనిందలు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కుంభం :- ఉద్యోగస్తులకు విధినిర్వణలో ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రగతిపథంలో సాగుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. విద్యార్ధులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత, పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం :- కొన్ని నచ్చని సంఘటన లెదురైనా భరించకతప్పదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవ దైర్శనాలు అనుకూలంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments