Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14-08-2022 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన...

weekly astro
, ఆదివారం, 14 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. రవాణా రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బంధువుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు.
 
వృషభం :- కొబ్బరి,పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. బంధువుల ఆకస్మిక రాకతో సందడి కానవస్తుంది. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు.
 
మిథునం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఏమాత్రం సంతృప్తినీయవు.
 
కర్కాటకం :- దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ ద్రవ్య, మందులు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో మీమాటకు గౌరవం పెరుగుతుంది. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కన్య :- బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. తప్పనిసరి చెల్లింపులు, ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమంకాదు.
 
తుల :- ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కార మవుతుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వ్యాపార రీత్యా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం లభిస్తుంది.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచలు స్ఫురిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మార్కెటింగ్, ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 
ధనస్సు :- దైవ, పుణ్యకార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బహుమతులు అందజేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూరప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం.
 
మకరం :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రతి స్వల్ప విషయానికి అసహనం ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
మీనం :- నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని. ఆందోళనను గుర్తిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-08-2022 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని పూజించిన...