మేషం :- పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది.
వృషభం :- ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయానయత్నం ఫలిస్తుంది. స్త్రీలకు చేతిపనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
మిథునం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు.
కర్కాటకం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం :- పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఆదాయం పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
కన్య :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి.
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. చిన్నారుల వైఖమనస్తాపం కలిగిస్తుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది.
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు.
ధనస్సు :- ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. విదేశాయానం కోసం చేసేయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవటం శ్రేయస్కరం.
మకరం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి.
కుంభం :- తాపిపని వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాలు,
జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. క్రయవిక్రయాలు సామాన్యం.
మీనం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా కృషి చేస్తేనే పెండింగ్ పనులు పూర్తి కాగలవు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుతారు.