Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-08-2022 శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని ఆరాధించిన...

Advertiesment
weekly astro
, శనివారం, 6 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధిక. దూర ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళకువ వహించండి. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
వృషభం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు పురోభివద్ది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువులు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. వాగ్వివాదాలకు, పంతాలకు పోకుండా కొన్ని వ్యవహారాలు మీరే చక్కబెట్టుకోవలసి ఉంటుంది.
 
మిథునం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి అసహనం ఎదురవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు చోటుచేసుకుంటాయి.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి నూతన యత్నాలు మొదలెడతారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి అభివృద్ధి దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులలో ఏకాగ్రత అవసరం. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. ఖర్చులు అధికం. ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
సింహం :- రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వాహనయోగం, వస్త్రప్రాప్తి వంటి శుభసూచనలున్నాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
 
కన్య :- ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె, తేయాకు, కాఫీ రంగాలలో వారికి కలిసి వచ్చే కాలం. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమరుపాటుతనం కూడదు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.
 
తుల :- మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి నుండి సహాయం లభించకపోవటంతో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత ఆందోళనతప్పదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది.
 
ధనస్సు :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యవసాయ, తోటల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రిప్రజెంటేటిన్లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ మొండివైఖరి వదిలి ప్రశాంత వహించుట మంచిది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వలన కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు.
 
కుంభం :- ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికం. కొబ్బరి, పండ్ల, పూలచిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోకతప్పదు.
 
మీనం :- విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఆశించిన విధంగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-08-2022 శుక్రవారం దినఫలాలు - శ్రీవరలక్ష్మీని పూజించి, అర్చించిన శుభం