Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-08-2022 శుక్రవారం దినఫలాలు - శ్రీవరలక్ష్మీని పూజించి, అర్చించిన శుభం

Advertiesment
Weekly Astrology
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులరాకతో గృహం సందడిగా ఉంటుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణాలు, పన్నులు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీలో వచ్చిన మార్పును మీ కుటుంబీకులు గుర్తిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. 
 
మిథునం :- వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి.దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
సింహం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల పని వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబీకుల నుండి, మిత్రుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. నిర్మాణ పనులలో స్వయం వీణ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతారు.
 
కన్య :- శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. బంధు మిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు.
 
తుల :- గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు క్రీడ, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం.
 
వృశ్చికం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు.
 
ధనస్సు :- ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీ అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఫీజులు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. షాపింగ్ వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం.
 
మకరం :- ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూలు, కురగాయలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుండి సమస్యలు తలెత్తుతాయి. మీ కుటింబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం.
 
మీనం :- చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలతో తడిపిన పసుపును నుదుట ధరిస్తే..