Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-08-2022 మంగళవారం దినఫలాలు - లక్ష్మీ కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి..

Advertiesment
Astrology
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- ఆర్థికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీ పడవలసివస్తుంది. కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.
 
వృషభం :- వెండి, బంగారు, తాకట్టు వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటుంది. విద్యార్థులకు, విద్యా రంగాల వారికి మెళుకువఅవసరం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది.
 
మిథునం :- కాంట్రాక్టుర్లలకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. వాహనం విషయంలో సంతృప్తి కానవస్తుంది. క్రయ విక్రయ రంగాలలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. కళాకారులకు, రచయితలకు పత్రికారంగంలో వారికి మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలు అనుకూలం.
 
కర్కాటకం :- నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పండ్లు, పూల, కూరగాయ వ్యాపారులకు కలిసివస్తుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. బంధువులను కలుసుకుంటారు. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసివస్తుంది. కోర్టు వ్యవహరాలు ప్రగతిపథంలో నడుస్తాయి.
 
కన్య :- బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. గృహంలో మార్పులు, చేర్పులకు కొంతకాలం వేచియుండటం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యావహారాలలో ఆచి తూచి వ్యవహరించండి. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి.
 
తుల :- రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తాయి. నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. నూతన దంపతుల మధ్య సంతాన యోగం.
 
ధనస్సు :- ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఓర్పుగా ఎలా ఉండాలో నేర్చుకోవడం ఎంతైనా అవసరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంమంచిది.
 
మకరం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు. వ్యాపారాలలో పోటీ పెరగడం వల్ల అధికంగా శ్రమించవలసి ఉంటుంది.
 
కుంభం :- కుటుంబ విషయాలు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రుల సహాయంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మీనం :- ప్రయాణాలలోను, బ్యాంకు వ్యవహారాలలోను మెళుకువ అవసరం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు ఊహించనివి కావటంతో రుణయత్నాలు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-08-2022 సోమవారం దినఫలాలు - వరసిద్ది వినాయకుడిని గరికెతో పూజించినా...