Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-08-2022 సోమవారం దినఫలాలు - వరసిద్ది వినాయకుడిని గరికెతో పూజించినా...

Advertiesment
Astrology
, సోమవారం, 15 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
వృషభం :- మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. 
 
మిథునం :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కర్కాటకం :- కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన శ్రమ, విశ్రాంతి లోపంవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు చికాకు పరుస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకులను అధికమిస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
సింహం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ ప్రయాణాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్వీజ్, పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. రాజకీయనాయకులు వేడుకలలో పాల్గొంటారు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పని వారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది.
 
తుల :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. పురస్కారాలు వంటివి పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. మీ ఆర్ధిక స్థితిని చూసి ఇతరులు అపోహపడే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. విదేశీయాన యత్నాలలో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. విద్యార్థులు ప్రముఖుల నుండి బహుమతులు అందుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
ధనస్సు :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది. మీ మాటలు ఇతరుల తప్పుగా అర్థ చేసుకునే ఆస్కారం ఉంది. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, పుణ్య, సేవాకార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు.
 
మకరం :- చిట్స్, ఫైనాన్స్, రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. విందులలో పరిమితి పాటించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల చాలా అవసరం.
 
కుంభం :- పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటంది. సాహస ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. స్త్రీలు దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మీనం :- ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఒక వ్యవహార నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం కోసం ధనం బాగుగా వ్యయంచేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు...