Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-04-2023 తేదీ గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి...

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- ఇతరుల జోక్యం వలన మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. స్త్రీలకు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఉమ్మడి వ్యాపారాల్లో పునరాలోచన అవసరం.
 
వృషభం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదాపడతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు, పెట్టుబడులు లాభిస్తాయి. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ఉద్యోగం చేసే చోట కొత్త ప్రయోగం చేయవద్దు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయాల్లో వారు ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచడం మంచిది. కళాకారులకు, రచయితలకు, పత్రికారంగంలోని వారికి అనుకూలమైన కాలం. 
 
కర్కాటకం :- స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించ గలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యం భంగం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.
 
సింహం :- వృత్తి వ్యాపారంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒర్పు, సహనం ఎంతో అవసరం. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి.
 
కన్య :- వృత్తి, ఉద్యోగాలందు ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. స్త్రీలకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. ఎరువులు, కిరాణా, ఫ్యాన్సీ రంగాల వారికికలిసి వచ్చే కాలం. ఖర్చులు అధికం.
 
తుల :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆడిటర్లకు గుర్తింపులభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మంచి మార్పులు రాగలవు. ప్రలోభాలకు లొంగవద్దు. గృహనికి మరమ్మత్తులు చేయించగలుగుతారు. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయాలలోని వారు ఆచి తూచి వ్యవహరించవలెను. తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు :- మీ సాయం పొందిన వారే వేలెత్తి చూపుతారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. విదేశీ చదువులకై చేయుప్రయత్నాలలో విజయం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్ములను ఇరకాటంలో పెట్టవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళుకువ చాలా అవసరం. సంతానం పైచదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తులు అధికారులకు విలువైన బహుమతులు అందించి ప్రసన్నం చేసుకుంటారు. స్త్రీల ప్రతిబాపాటవాలకు సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కుటంబంలో ప్రశాంతత, ప్రేమానుబంధాలు నెలకొంటాయి.
 
మీనం :- వ్యవహార ఒప్పందాల్లో ఖచ్చితంగా ఉండాలి. నూతన వ్యాపారాలు, వృత్తులు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి కష్టపడాలి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments