Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11-04-2023 తేదీ మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు..

Gemini
, మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి, సమస్యలు అధికం. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
వృషభం :- దీర్ఘకాలిక పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్థల స్థాపన విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. మీరంటే గిట్టని వ్యక్తులను సైతం ఆకట్టుకుంటారు. పెరిగిన ధరలు, విద్యుత్ బిల్లులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులను సాయం అడగటానికి బిడియపడతారు.
 
మిథునం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. రిటైర్టు ఉద్యోగస్తులు, అధికారులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంతానం భవిష్యత్ కోసం పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు.
 
కర్కాటకం :- పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు, కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు.
 
సింహం :- అధికారులకు ఒత్తిడి, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు అధికం. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కన్య :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
తుల :- స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్ళు అధికం. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగాపూర్తి చేస్తారు. ఎటువంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహనానికి లోనవుతారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికమవ్వటంతో ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం :- నూతన వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాహ సంబంధమై దూరప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు.
 
ధనస్సు :- పాత పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన మీ ధ్యేయం నెరవేరగలదు. బంధువులరాకతో ఖర్చులు అధికమవుతాయి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఏ.సి., కూలర్, విద్యుత్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది.
 
మకరం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినగాని నిలదొక్కుకోలేరు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు. రుణాల కోసం యత్నిస్తారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెలకువ అవసరం.
 
మీనం :- ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయటంమంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు పరిచయాలు వ్యాపాకాలు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-04-2023 తేదీ సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...