Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-04-2023 తేదీ సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

Advertiesment
Taurus
మేషం :- ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. నూతన గృహం కొనుగొలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం :- ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. కుటుంబంలోని కొన్ని మార్పులు భావోద్వేగాలకు గురి చేస్తాయి. బంధువులను కలుసుకుంటారు.
 
మిథునం :- ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- బోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి తప్పదు. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సివస్తుంది. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట మంచిది.
 
సింహం :- దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలోనివారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.
 
కన్య :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి ఆశాజనకం. షాపింగ్ దుబారా ఎక్కువగాఉండే అవకాశం ఉంది. ఎదుటివారి తీరును గమనించిముందుకు సాగండి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సహోద్యోగుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోవటం వలన ఒకింత ఒత్తిడికి గురవుతారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. అన్నీ లాభదాయకంగానే ఉంటాయి. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి.
 
మకరం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవచ్చును. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి.
 
కుంభం :- నూతన వ్యాపారాల పట్ల దృష్టి సారిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ఉపాధ్యాయ రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మీనం :- తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కుంటారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. ఆలయసందర్శనాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మొండి బకాయిలు సైతం వసూలుకా గలవు. కొన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి వారు తిరుమలకు రావొద్దు : తితిదే