మేషం :- ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. స్త్రీలతోమితంగా సంభాషించండి. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది.
వృషభం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనం ఉండదు. వాహనచోదకులకు అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ధైర్యముగా ముందుకు పోగలరు.
మిథునం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. స్త్రీలు అయిన వారి నుంచి ఆసక్తి కరమైన విషయాలు గ్రహిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు.
కర్కాటకం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నోటీసులు, రశీదులు అందుకుంటారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
సింహం :- ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. గృహంలో మార్పులు, చేర్పులకు వాయిదా పడతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాలు పట్ల ఆశక్తి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది.
కన్య :- కుటుంబ సమస్యలు, వ్యాపార లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు.
తుల :- స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది.
వృశ్చికం :- రాజకీయనాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
ధనస్సు :- వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ ప్రియతముల పట్ల, ముఖ్యల పట్ల శ్రద్ధ పెరుగును. కోర్టు వ్యవహారాలలో మెలకువ అవసరం. పాత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
మకరం :- కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇతరులు మీ నుంచి ఏమి కోరుకుంటున్నారో ముందు తెలుసుకొండి. మీ మాటా, తీరు వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
కుంభం :- పని చేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు షాపింగ్లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన గృహం కొనుగొలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును.
మీనం :- పారిశ్రమిక రంగాల వారికి అన్నివిధాలా ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం మంచిదికాదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. ప్రియతములను కలుసుకుంటారు. ప్రత్తి, పొగాకు, చెరుకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం.