Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-03-2025 సోమవారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

రామన్
సోమవారం, 3 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాసవస్తువులు కొనుగోలుచేస్తారు. పత్రాలు, రశీదలు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. ఆర్భాటాలకు విపరీతతంగా ఖర్చు చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పత్రాలు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తిచేయగల్గుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణసమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. ఆత్యీయులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుక తలపెడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్వయంకృషితో కార్యం సాధిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. ఆపన్నులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో వేడుక నిశ్చయమవుతుంది. పనులు పురమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనవసర ఒత్తిళ్లకు గురికావద్దు. అన్ని విధాలా మంచి జరుగుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య అకారణ కలహం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

ఛాతినొప్పి పేరుతో పోసాని డ్రామాలు... ఖాకీలకు వైకాపా నేత ముప్పతిప్పలు (Video)

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

సరూర్ నగర్‌లో పది మంది హిజ్రాల అరెస్టు.. (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

28-02- 2025 శుక్రవారం రాశిఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments