Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-05-2024 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది...

రామన్
బుధవారం, 1 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ అష్టమి రా.12.56 శ్రవణం రా.12.29 ఉ.శే.వ.6.57 కు తె.వ.4.16ల ప.దు. 11.31 ల 12.22.
 
మేషం :- ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆలయాలను సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలసివచ్చేకాలం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారితో లౌక్యం అవసరం. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. దంపతుల మధ్య విభేదాలు, చికాకులు వంటివి తలెత్తుతాయి. ఫైనాన్సు, చిట్ ఫండ్, ఏదైనా ఆకస్మికంగా అమ్మే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం :- బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. 
 
కర్కాటకం :- మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్యర్యం కలిగిస్తుంది. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో ఒకింత మనశ్శాంతి పొందుతారు. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
 
సింహం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. పాతమిత్రుల కలయికతో సంతృప్తికానవస్తుంది. హోదాలు, పదవీయోగాలుదక్కే సూచనలు ఉన్నాయి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- ఒక కార్యం నిమిత్తం దూరప్రాంతానికి ప్రయాణం చేయవలసి రావచ్చు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు అనుకూలమైనకాలం. ప్రత్యర్ధుల విషయంలో అప్రమత్తత అవసరం.
 
తుల :- నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తెలుత్తుతాయి. ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి వల్ల పైఅధికారులతో మాటపడకతప్పదు.
 
వృశ్చికం :- విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతులు పెరుగును. ఉమ్మడి వ్యాపారాలపట్ల ఏకాగ్రత అవసరం. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
ధనస్సు :- కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. శత్రువులు మిత్రులగా మారి సహాయాన్ని అందిస్తారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- వస్త్ర, కళంకారీ, పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చే కాలం. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. మిత్రులతో కలిసి ఆలయలను సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
మీనం :- కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగంలోని వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లోవారు మార్పునకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్థులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తు తాయి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో యిబ్బందులు ఎదుర్కోక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments