Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-04-202 మంగళవారం దినఫలాలు - మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు...

Weekly astrology

రామన్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర ఐ|| సప్తమి రా.2.49 ఉత్తరాషాఢ రా.1.36 ఉ.వ.10.07 ల 11.40. తె.వ. 5.25ల ఉ. దు. 8.24 ల 9.12 రా.దు. 10.52 ల 11.39.
 
మేషం :- కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెళకువ అవసరం. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. మీ ఆశయాలకు, అభిరుచికి తగినవ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. బంధువుల రాకపోకలవల్ల గృహంలో సందడి కానవస్తుంది. దైవ కార్యక్రమాల కోసం ధనంబాగా వెచ్చిస్తారు.
 
వృషభం :- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు.
 
మిథునం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైనకాలం. దైవ సేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారంకలదు. 
 
కర్కాటకం :- రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు జాగ్రత్త వహించండి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. దూర ప్రాంతం నుండి అందుకున్న ఒక వార్త నిరుద్యోగులకు ఎంతగానో ఉపకరిస్తుంది.
 
సింహం :- కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
కన్య :- విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పత్రికా, వార్తా సంస్థలలోనివారికి తోటివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. సోదరి, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు.
 
తుల :- ఉపాధ్యాయులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయాలకు సంభంధించిన ఆలోచనలు చుట్టు ముడతాయి. రావలసిన ధనం వాయిదా పడతాయి. నూతన దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రతముఖ్యం.
 
వృశ్చికం :- కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. సోదరుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. స్త్రీల మాటలకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.
 
మకరం :- ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాబడికి మించిన ఖర్చులు ఎదుర్కొనుట వలన ఆందోళన చెందుతారు. గృహనిర్మాణాలలో మరమత్తులు చేపడతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆరాటంతగదు.
 
కుంభం :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి.
 
మీనం :- కొన్ని వ్యవహారాలు ధనవ్యయంతోనే సానుకూలమవుతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణబాధలు కొంత తీరతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-04-202 సోమవారం దినఫలాలు - పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు...